Sunday, February 26, 2023

మౌలానా అజాద్


 

నవరత్నాలు- అక్బర్


        అక్బర్ నవరత్నాలు

 నవరత్నాలు అనగా 9మంది అసాధారణ ప్రజ్ఞా పాటవాలు కలిగిన వ్యక్తుల సమూహము అని అర్థము. వారి యొక్క సంక్షిప్త వివరణ క్రింది వివరించడం జరిగింది.

 అక్బర్ నవరత్నాలు మరియు వారి యొక్క సంక్షిప్త వివరణ:

1 అబుల్ ఫజల్ : అక్బర్ ముఖ్య సలహాదారుడు మరియు అక్బర్ నామ గ్రంధరచయత, అక్బర్ ప్రధానమంత్రి.

2.ఫైజి  

అక్బర్ విద్యాశాఖ మంత్రి మరియు రాకుమారుల గురువు. 

3. తాన్ సేన్ : అక్బర్ ఆస్థాన గాయకుడు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి . హిందూ ధర్మావలంబికుడు.

4. బీర్బల్

  గొప్ప ధనవంతుడు మరియు గొప్ప చతురత కలిగినటువంటి వ్యక్తి, అక్బర్ రాజ్య విదేశాంగ మంత్రి.

5. టోడర్మల్

 అక్బర్ ఆర్థిక శాఖ మంత్రి.

6. రాజా మాన్ సింహ్ :

  అక్బర్ మొఘల్ సైన్యం యొక్క చీఫ్ మరియు అక్బర్ కు అత్యంత విశ్వాస పాత్రుడు; 

7. అబ్దుల్ రహీం ఖాన్ ఖానా:

  అక్బర్ రక్షణ మంత్రి; మహాకవి.

  

8. ఫకీర్ అజియావో దీన్: అక్బర్ ధార్మిక మంత్రి.


9. ముల్లా దో పియాజా: అక్బర్ హోం శాఖ మంత్రి.


Wednesday, February 22, 2023

BOSTAN बोस्तान सादी


 बोस्तान सादी


 एक नई और क़ैदी


एक शख़्स कृपापूर्ण और सखावत वाली

 तबीयत रखने के बावजूद कंगाल था ।

(ख़ुदा करे कि कमीने को माल ना मिले और पुण्यवान तंग-दस्त ना हो )

एक क़ैदी ने उस की तरफ़ पैग़ाम भेजा कि

 ऐ !नेकबख़्त अमीर मेरी मदद कर कि मैं क़ैद-ख़ाने में हूँ। 

ख़ाली हाथ सखी ने क़ैद करने वालों को कहा  इस को मेरी ज़मानत पर रिहा कर दो । 

उन्होंने बात मान ली और क़ैदी को खोल दिया 

तो वो ऐसे भागा जैसे परिंदा पिंजरे का दरवाज़ा खुला देखकर भागता है 

और ऐसी दौड़ लगाई कि इस की गर्द-ए-राह का हवा भी मुक़ाबला ना कर सकी। 

उन्होंने उसी वक़्त उस ज़मानती को पकड़ लिया कि या पैसे निकालो या बंदा दो।

  बेचारा बेक़सूर जेल में पड़ा रहा ना किसी को पत्र लिखा ना

 पैग़ाम भेजा, अर्से बाद किसी दोस्त का उस तरफ़ से गुज़र हुआ तो उसने पूछा

 ऐ नेकबख़्त मेरा नहीं ख़्याल कि तो ने चोरी की हो या किसी का माल खाया हो! 

फिर जेल में क्यों है? 

उसने कहा बात तो ऐसे ही है मगर मैंने इसी जेल में एक क़ैदी को परेशान हाल देखा तो 

अपने आपको क़ैदी बना लेने के इलावा मुझे उस की रिहाई नज़र ना आई ।

 आख़िरकार बेचारा जेल में ही मर गया। 

मगर नेक-नामी ले गया।

ज़िंदा-दिल शख़्स मिट्टी के नीचे भी सोया हो तो इस का जिस्म इस ज़िंदा आलिम से बेहतर है


 जिसका दिल मुर्दा हो क्योंकि ज़िंदा-दिल का जिस्म मर भी जाये तो कोई हर्ज नहीं उस का दिल तो ज़िंदा है

పర్షియన్ కధలు

 ఒక సజ్జనుడి కధ

   ఒక వ్యక్తి గొప్ప దయార్ధ్ర హృదయం, జాలి గుణం కలిగి ఉండేవాడు. స్వతహాగా మంచివాడు కావటం వల్ల ఎప్పుడూ పేదరికం అనుభవిస్తూ ఉండేవాడు .(భగవంతుడు సజ్జనునికి ఎప్పుడూ తన కారుణ్యం ప్రసాదించు గాక )ఒకసారి .ఒక ఖైదీనుండి అతనికి ఒక ఉత్తరం వచ్చింది అందులో " ఓ పుణ్యాత్ముడా నన్ను ఈ చేరసాల నుంచి విడిపించమని( దొంగతనం నేరంలో శిక్ష అనుభవిస్తున్న వాడు) అభ్యర్ధన ఉంది .చేతిలో చిల్లి గవ్వ లేని ఆ పుణ్య పురుషుడు తన జామీను తీసుకొని అతన్ని వదిలిపెట్టమని పోలీసు వారిని కోరగా వారు అతన్ని విడుదల చేసారు. కానీ విడుదల అయిన తర్వాత ఆ ఖైదీ దేశం వదిలి పారిపోయాడు. అప్పుడు పోలీసులు అవ్యక్తి దగ్గరికి వెళ్లి ఖైదీని విడిపించినం దులకు డబ్బు కట్టమని లేకుంటే తనని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. చివరకు చేతిలో చిల్లి గవ్వ లేని అవ్యక్తి డబ్బు కట్టలేక ఖైదు కావించ బడ్డాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.. అదొంగ ఇక వచ్చిందిలేదు ఇతన్ని విడిపించింది లేదూ . ఒక సారి అతని పరిచయస్తుడు అతన్ని సందర్శించి "మిత్రమా నీవేప్పుడు దొంగతనం చేసినవాడవు కావు, ఇతరుల సొమ్ము కు ఆశపడ్డ వానివి కూడా కావు మరి ఎందుకు జైల్లోఇంత శిక్ష అనుభవిస్తూ ఉన్నావు అని అడగగా అప్పుడు "నేను ఒక ఖైదీని చెరసాలలో మగ్గుతుంటే అతని యాతన చూడలేక, జామీను ఇచ్చి విడిపించాను. కానీ నా దగ్గర అతనికి కట్టడానికి డబ్బులేదు అందుకే అతనికి స్వేచ్చనిచ్చి అతని శిక్ష అనుభవిస్తూ ఇలా ఉన్నాను అన్నాడు."

   వాస్తవానికి కరుణ హృదయం లేని ఒక జ్ఞాని కన్నా

   మంచి మనసు కలిగిన వారు మరణించినప్పటికీ ఎప్పుడూ ఈ భూమి గర్భం లోఉన్నా బతికే ఉంటారు.

   మానవత్వం లేక జీవించి ఉన్న శరీరం కన్నా

  మానవత్వం తో పరిమలించే మనసున్న మృత శరీరమే గొప్ప అని వివరించారు ప్రముఖ రచయిత సాదీ (ప్రముఖ పర్షియన్ మహారచయిత సాది అద్భుత గ్రంధం బూస్తాన్ నుండి )

Sunday, February 19, 2023

ఆత్మ జ్ఞానం

BANU KHUDSIYA


 మిత్రులారా ప్రపంచం లో ఎంతో మంది మానవతావాదులు భౌతిక అలౌకిక తత్వవేత్తలు ఉన్నారు వారందరి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది