Wednesday, February 22, 2023

పర్షియన్ కధలు

 ఒక సజ్జనుడి కధ

   ఒక వ్యక్తి గొప్ప దయార్ధ్ర హృదయం, జాలి గుణం కలిగి ఉండేవాడు. స్వతహాగా మంచివాడు కావటం వల్ల ఎప్పుడూ పేదరికం అనుభవిస్తూ ఉండేవాడు .(భగవంతుడు సజ్జనునికి ఎప్పుడూ తన కారుణ్యం ప్రసాదించు గాక )ఒకసారి .ఒక ఖైదీనుండి అతనికి ఒక ఉత్తరం వచ్చింది అందులో " ఓ పుణ్యాత్ముడా నన్ను ఈ చేరసాల నుంచి విడిపించమని( దొంగతనం నేరంలో శిక్ష అనుభవిస్తున్న వాడు) అభ్యర్ధన ఉంది .చేతిలో చిల్లి గవ్వ లేని ఆ పుణ్య పురుషుడు తన జామీను తీసుకొని అతన్ని వదిలిపెట్టమని పోలీసు వారిని కోరగా వారు అతన్ని విడుదల చేసారు. కానీ విడుదల అయిన తర్వాత ఆ ఖైదీ దేశం వదిలి పారిపోయాడు. అప్పుడు పోలీసులు అవ్యక్తి దగ్గరికి వెళ్లి ఖైదీని విడిపించినం దులకు డబ్బు కట్టమని లేకుంటే తనని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. చివరకు చేతిలో చిల్లి గవ్వ లేని అవ్యక్తి డబ్బు కట్టలేక ఖైదు కావించ బడ్డాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.. అదొంగ ఇక వచ్చిందిలేదు ఇతన్ని విడిపించింది లేదూ . ఒక సారి అతని పరిచయస్తుడు అతన్ని సందర్శించి "మిత్రమా నీవేప్పుడు దొంగతనం చేసినవాడవు కావు, ఇతరుల సొమ్ము కు ఆశపడ్డ వానివి కూడా కావు మరి ఎందుకు జైల్లోఇంత శిక్ష అనుభవిస్తూ ఉన్నావు అని అడగగా అప్పుడు "నేను ఒక ఖైదీని చెరసాలలో మగ్గుతుంటే అతని యాతన చూడలేక, జామీను ఇచ్చి విడిపించాను. కానీ నా దగ్గర అతనికి కట్టడానికి డబ్బులేదు అందుకే అతనికి స్వేచ్చనిచ్చి అతని శిక్ష అనుభవిస్తూ ఇలా ఉన్నాను అన్నాడు."

   వాస్తవానికి కరుణ హృదయం లేని ఒక జ్ఞాని కన్నా

   మంచి మనసు కలిగిన వారు మరణించినప్పటికీ ఎప్పుడూ ఈ భూమి గర్భం లోఉన్నా బతికే ఉంటారు.

   మానవత్వం లేక జీవించి ఉన్న శరీరం కన్నా

  మానవత్వం తో పరిమలించే మనసున్న మృత శరీరమే గొప్ప అని వివరించారు ప్రముఖ రచయిత సాదీ (ప్రముఖ పర్షియన్ మహారచయిత సాది అద్భుత గ్రంధం బూస్తాన్ నుండి )

No comments:

Post a Comment